లా ఐదో సెమిస్టర్ పరీక్షా ఫలితాలు విడుదల చేయాలని టీఎనఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రప్ప డిమాండ్ చేశారు. మంగళవారం ఉపకులపతి ప్రొఫెసర్ ఎనటీకే నాయక్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా చంద్రప్ప మాట్లాడుతూ.... ఆల్ ఇండియా బార్ పరీక్షలు రాయడానికి ఈనెల 25వ తేదీ లోపు రిజిసే్ట్రషన చేసుకోవాలని, ఆ లోపు ఐదో సెమిస్టర్ ఫలితాలు విడుదల కాకపోతే ఎందరో విద్యార్థులు నష్టపోతారని అన్నారు. కార్యక్రమంలో న్యాయ కళాశాల విద్యార్థులు గోవర్ధన, సుమలత, అరుణ, దీప్తి పాల్గొన్నారు.