ఒక తల్లి, ఒక చెల్లి కలిసి కన్నీటితో ఓ సైకోకు రాసిన లేఖలోని మొదటి భాగం అంటూ తెలుగుదేశం పార్టీ తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ట్వీట్ చేసింది. అంతకుముందు, "బిగ్ ఎక్స్‌పోజ్, 24 అక్టోబర్ మధ్యాహ్నం 12 గంటలకు" అంటూ ట్వీట్ చేసింది. ఆ తర్వాత కాసేపటి క్రితం రేపు కాదు... ఈరోజే ఆ సంచలనాన్ని వెలుగులోకి తెస్తున్నామని మరో ట్వీట్ చేసింది. ఆ తర్వాత షర్మిల, విజయమ్మ... జగన్‌కు రాసిన లేఖ అంటూ వరుస ట్వీట్లు చేసింది. జగన్‌కు 12 సెప్టెంబర్ 2024న రోజున లేఖ రాసినట్లుగా తేదీ ఉంది.చరిత్రలో ఏ పురాణం చూసినా, ప్రపంచంలోని ఏ జీవిని చూసినా తల్లి తర్వాతేనని, జంతువులకు కూడా తల్లి అంటే అమితమైన ప్రేమ ఉంటుందని, కానీ ఈ కన్నీటి లేఖ (షర్మిల, విజయమ్మ)ను చూస్తే జంతువుల కంటే ఘోరంగా ప్రవర్తించే ఓ వింత సైకో గురించి తెలుసుకుంటారని జగన్‌ను ఉద్దేశించి పేర్కొంది.ఇంటి ఆడ బిడ్డకు ఆస్తి ఇవ్వకుండా, జగన్ అనే సైకో ఎలా వేధిస్తున్నాడో... తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఇచ్చిన మాటని ఈ సైకో ఎలా తప్పాడో చెబుతూ... కన్నీళ్ళతో, సైకో జగన్‌కి చెల్లి షర్మిల లేఖ రాశారని, ఆ లేఖపై తల్లి విజయమ్మ సంతకం పెట్టారని పేర్కొంది.ఇలాంటి సైకోలు రాజకీయాల్లో ఉంటే... మన సమాజంలో ఉంటే... ఎంత ప్రమాదమో చెప్పటానికే ఈ లేఖని ప్రజల్లో పెడుతున్నామని పేర్కొంది. ఈ లేఖలో మొత్తం ఎనిమిది అంశాలు ఉన్నాయని, ఏడో అంశం చూస్తే, జగన్ అనే వాడు రాజకీయంగా ఎంత పిరికివాడో తెలుస్తుందని పేర్కొంది.