బెల్ట్ షాపులు లేని మండలంగా నాంపల్లి మండలం కావాలని శుక్రవారం మండల కేంద్రంలోని స్థానిక బస్టాండ్ సెంటర్ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు కాంగ్రెస్ అధ్యక్షుడు కత్తి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్లకార్డులతో భారీ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్బంగా బెల్ట్ షాపులు నిర్మూలించాలని ప్రతిజ్ఞ చేశారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పెద్దిరెడ్డి సంజీవరెడ్డి రాజు ఉన్నారు.