శ్రీకాకుళం మండలంలోని సింగుపురం గ్రామంలో చైల్డ్ ఫండ్ ఇండియా లింక్ వర్కర్స్ స్కీం ఆధ్వర్యంలో ఏపీ శాక్స్ సహకారంతో జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సలహా మండలి ఆధ్వర్యంలో శుక్రవారం ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
డాక్టర్ ఎ. అజయ్, స్త్రీ వైద్య నిపుణులు డాక్టర్ జి. శిరీషలచే 137 మందికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి 37 మందికి ఈసీజి, 86మందికి హెచ్ఐవి టెస్టులు నిర్వహించారు. అనంతరం రోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు.