రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం అటవీ ప్రాంతంలో శుక్రవారం జనరల్ కూంబింగ్ లో మద్దూర్ బీట్ వద్ద ఇద్దరు తమిళ కూలీలను అరెస్ట్ చేసి ఒక మోటార్ బైక్ స్వాధీనం చేసుకున్నామని సిద్ధవటం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కళావతి తెలిపారు. వారి వద్ద నుండి 23 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో సెక్షన్ ఆఫీసర్ సురేష్, ఎఫ్బిఓ దీపిక, విశ్వనాధ్ రెడ్డి ఏబీవో నాగభూషణం రెడ్డి పాల్గొన్నారు