కంభంలో అక్రమంగా గోవా మద్యం నిలువ ఉంచిన ఓ వ్యక్తిని శనివారం ఎక్సైజ్ శాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వ్యక్తి వద్ద నుంచి 50 ఫుల్ బాటిల్ల మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు.
తక్కువ ధరకే గోవా నుండి మద్యం దిగుమతి చేసుకొని స్థానికంగా అమ్మేందుకు వ్యక్తి ప్రయత్నిస్తున్నట్లుగా ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. ఆ వ్యక్తిపై కేసు నమోదు చేసి మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నట్టుగా సీఐ కొండారెడ్డి తెలిపారు.