తూర్పుగోదావరి జిల్లాలో పాపికొండల విహారయాత్ర మొదలైంది. గండిపోచమ్మ బోటింగ్ పాయింట్ నుంచి 41 మంది పర్యాటకులు, ఐదుగురు సిబ్బందితో బోటు విహారయాత్రకు బయలుదేరింది. పోలీసులు పర్యాటకుల బ్యాగులను తనిఖీ చేసి.. అనంతరం పర్యటనకు అనుమతించారు. ఈ క్రమంలో దేవీపట్నం ఎస్సై షరీఫ్ పర్యాటకులకు పలు సూచనలు చేశారు. కాగా, గోదావరి వరదల కారణంగా.. జూలైలో పాపికొండల టూర్‌ను అధికారులు ఆపేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa