రాజాం తెదేపా కార్యాలయంలో శనివారం టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మాజీ మంత్రి ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ ప్రారంభించారు. ఈ మేరకు ఎమ్మెల్యే తన సభ్యత్వ నమోదును రెన్యువల్ చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజాం నియోజకవర్గంలో పార్టీ సభ్యత్వాలను తెదేపా నేతలు అత్యధికంగా చేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. వంద రూపాయల సభ్యత్వంతో రూ.లక్షల ప్రమాద బీమా దేశంలో ఎక్కడా లేదన్నారు.