ఏపీలో రేషన్ కార్డులు ఉన్నవారికి వచ్చే నెల నుంచి కందిపప్పు, చక్కెర అందించనున్నారు. అయితే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వాహనాల ద్వారా రేషన్ పంపిణీ జరిగింది. ఏపీలో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ఈ పద్ధతిని మార్చింది. పాత పద్ధతిలోనే తిరిగి రేషన్ డీలర్ల ద్వారా రేషన్ పంపిణీ చేస్తోంది.
ఎండీయూ వాహనాల మెయింటైన్స్‌కు అదనపు భారం పడుతుందనే ఆలోచనతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కొందరి విజ్ఞప్తుల మేరకు ఎండీయూ వాహనాలను వాడాలా? వద్దా? అనే విషయంపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.