రాబోయే ఐదు సంవత్సరాల్లో కరెంటు చార్జీలు పెంచనని పులివెందుల ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీని వైయస్ఆర్‌సీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి గుర్తు చేశారు. ఈ మేరకు పులివెందులలో చంద్రబాబు 02.08.2023న చేసిన ప్రసంగం వీడియోను వైయస్ జగన్ తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు.
టీడీపీ అధికారంలోకి వచ్చి ఉంటే విద్యుత్ చార్జీలు తగ్గించేవాళ్లం అని గతంలో చెప్పిన మీరు.. ఇప్పుడు ప్రజలు ఎంతగా వద్దని వేడుకున్నా వినిపించుకోకుండా రూ.6,072.86 కోట్ల భారం వేయడం భావ్యమేనా? ఎన్నికల ముందు అధికారం కోసం ఇచ్చిన హామీ మేరకు ఈ చార్జీలను ప్రభుత్వమే భరించాలని వినియోగదారులు చేసిన విజ్ఞప్తులను ఎందుకు పెడచెవిన పెట్టారు? ప్రజలపై అదనపు చార్జీల భారం వేయడమే మీ విజనా?’ అంటూ చంద్రబాబుపై వైయస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.