రోజూ ఒక యాపిల్ తింటే డాక్టర్‌తో పని ఉండదని చిన్నప్పటి నుంచి వైద్యులు చెబుతూనే ఉన్నారు. ఎందుకంటే కెలోరీలు, పీచు, సి-విటమిన్, కాపర్, పొటాషియం వంటి పోషకాలు యాపిల్‌లో అధికం. ఇది మలబద్దక సమస్యను నివారిస్తుంది. రక్తపోటును క్రమబద్ధం చేస్తుంది. కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉదయం ఖాళీ కడుపుతో వీటిని తినవచ్చు. అంతేకాదు గ్రీన్ యాపిల్ తింటే కడుపు కూడా మరింత శుభ్రంగా ఉంటుంది.