సంస్థానాలు విలీనం ద్వారా దేశ సమైక్యతకు, సమగ్రతకు, భద్రతకు ఎనలేని కృషిచేసిన త్యాగధనులు సర్ధార్ వల్లభాయ్ పటేల్ అని ఎచ్చెర్లలోని డా. బి. ఆర్. అంబేద్కర్ విసి ఆచార్య కె. ఆర్. రజని బుధవారం అన్నారు.
స్వాతంత్య్ర సమరయోధునిగా, దేశ ప్రధమ ఉప ప్రధానిగా, రాజకీయయోధునిగా ఖ్యాతి గాంచిన సర్ధార్ పటేల్ జీవితం ఎంతో ఆదర్శనీయమన్నారు. వల్లభాయ్ పటేల్ జయింతి కార్యక్రమాన్ని 'రాష్ట్రీయ ఏక్తా దివాస్'గా కేంపస్ లో నిర్వహించారు.