బీహార్లోని అరారియాలో కేవలం రూ.15 కోసం ఒక దుకాణదారుడు మహిళ ముక్కును నరికాడు. ఈ ఘటన శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. బాధితురాలు ఓ దుకాణదారుడికి రూ.15 అప్పు ఉంది.
బకాయి తిరిగి ఇవ్వాలని అతను అడగ్గా, చిల్లర డబ్బులు లేవని.. తర్వాత ఇస్తామని చెప్పింది. ఈ విషయంపై ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగి.. అది తీవ్రస్థాయికి చేరింది. అతను ఆ మహిళపై గొడ్డలితో దాడి చేయగా.. ఆమె ముక్కు కట్ అయింది.