భక్తులు పరమ పవిత్రంగా భావించే కార్తీకమాసం తొలి సోమవారం సందర్భంగా శివాలయాలకు భక్తులు పోటెత్తారు. కార్తీకమాసాన్ని పురస్కరించుకుని వేలాదిమంది భక్తులు స్వామి అమ్మవార్లను తెల్లవారుజాము నుంచే దర్శించుకుంటున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ఆలయాల్లో తెల్లవారుజామున 5గంటల నుంచి రాత్రి 9గంటల వరకు నిరంతర దర్శనం కల్పించడానికి ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈసందర్భంగా ప్రధాన ఆలయాలను భక్తులు దర్శించుకుని భక్తి శ్రద్ధలతో మొక్కులు సమర్పించుకుంటున్నారు. మహిళ భక్తులు ఆలయ పరిసరాల్లో కార్తీక దీపాలను వెలిగించారు. ఆలయ పరిసరాలు భక్తుల శివనామస్మరణతో మార్మోగిపోయాయి.