శ్రీశైలంలో లేడీ అఘోరీ నాగ సాధు కాషాయ వస్త్రాలు ధరించి మల్లన్న ఆలయం వద్దకు వచ్చారు. అఘోరీ గురించి తెలుసుకున్న స్థానికులు, భక్తులు ఆమెను చూసేందుకు పెద్దఎత్తున గుమిగూడారు. దీంతో ఆత్మకూర్ డీఎస్పీ రామాంజీ నాయక్ ఎటుంటి అవాంఛనీయ ఘటనలూ జరగకుండా భారీ బందోబస్తుతో ఏర్పాటు చేశారు. అఘోరీకి మల్లన్న దర్శనం చేయించారు. అనంతరం ఆమె శ్రీశైలం సమాధుల వద్ద మీడియాతో మాట్లాడారు.సనాతన ధర్మాన్ని కాపాడాలని అఘోరీ నాగ సాధు హిందువులకు పిలుపునిచ్చారు.
రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు గో హత్యలను నిర్మూలించాలని, సనాతన ధర్మాన్ని కాపాడాలని కోరారు. ఆడపిల్లల మీద జరిగే అఘాయిత్యాలు ఆపాలని సూచించారు. కోటప్పకొండ, విజయవాడ కనకదుర్గమ్మ ఆలయాలను నేడు దర్శించుకోనున్నట్లు అఘోరీ తెలిపారు. ఆ రెండు ఆలయాల దర్శనంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తన పర్యటన ముగిస్తుందని చెప్పుకొచ్చారు. సోమవారం రోజున తెలంగాణలోని పోచమ్మ ఆలయాన్ని సందర్శించుకుని అనంతరం అటు నుంచి అటే కుంభమేళాకు వెళ్తానని అఘోరీ నాగసాధు వెల్లడించారు.