శ్రీకాకుళం జిల్లాలో రణస్థలం మండలంలో ఇటీవల జరిగిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ లోని రాగి వైరు చోరీ కేసులో ఏడుగురు నిందితులను అరెస్టు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి తెలిపారు.
ఆదివారం ఆయన కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ 53 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ నుండి సుమారు 630 కేజీల రాగి వైర్లు దొంగిలించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కేసులో మరి కొంతమంది ఉన్నారని వారిని త్వరలోనే విచారిస్తామన్నారు.