స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్‌గా అవకాశం కల్పించడంపై సీఎం చంద్రబాబుకు టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ట్విటర్ వేదికగా ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేశారు. కొన్ని నెలలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ మైదానంలో ఉన్న చెత్తని శుభ్రం చేసే పనిలో నిమగ్నమై ఉన్నానని, ఆ పని దిగ్విజయంగా పూర్తి చేయడంతో నేడు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్‌గా ముఖ్యమంత్రి నియమించారని పట్టాభి చెప్పారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి పట్టణాన్ని, గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచే కీలకమైన బాధ్యతలు అప్పగించిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు.