ఏపీ రాజధాని అమరావతిపై కీలక అప్డేట్ వచ్చింది. అమరావతి నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంకు నుంచి రూ. 15 వేల కోట్ల రుణం మంజూరైంది. ఈ నిధుల వినియోగంపైన ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.
సీఆర్డీఏకు ఈ మేరకు అధికారం కల్పిస్తూ విధి విధానాలు ఖరారు చేసింది. అమరావతి అభివృద్ధి ప్రణాళిక అమలు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొంది. అమరావతిలో అత్యున్నత ప్రమాణాలతో మౌలిక వసతులు, నిర్మాణాలు, ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉండేలా కార్యాచరణ చేపట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.