ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ రూపుదిద్దుకుంది. అసెంబ్లీలో ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టారు. రాష్ట్ర పునర్ నిర్మాణం, పేదల సంక్షేమమే లక్ష్యంగా.. ఏపీ బడ్జెట్‌లో వివిధ రంగాలకు ప్రాధాన్యమిచ్చారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి బడ్జెట్ ఇది.. నాలుగు నెలల కోసం ఈ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టింది ప్రభుత్వం. ఈ నెల 22 వరకు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. బడ్జెట్ ఆమోదంతోపాటు కీలక బిల్లులను ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం.
వ్యవసాయ బడ్జెట్ కేటాయింపులు ఇలా
* అన్నదాత సుఖీభవ - రూ.4,500 కోట్లు
* రాయితీ విత్తనాలకు - రూ.240 కోట్లు
* వడ్డీ లేని రుణాలకు - రూ.628 కోట్లు
* పంటల బీమా - రూ.1,023 కోట్లు
* భూసార పరీక్షలకు - రూ.38.88 కోట్లు
* విత్తనాల పంపిణీ - రూ.240 కోట్లు
* ఉచిత వ్యవసాయ విద్యుత్ - రూ.7241.30 కోట్లు
* ఎరువుల సరఫరా - రూ.40 కోట్లు
* వ్యవసాయ మార్కెటింగ్ - రూ.314.80 కోట్లు
* సహకార శాఖ - రూ.308.26కోట్లు
* పొలం పిలుస్తోంది - రూ.11.31 కోట్లు
* ప్రకృతి వ్యవసాయం - రూ.422.96 కోట్లు
* డిజిటల్ వ్యవసాయం - రూ.44.77 కోట్లు
* వ్యవసాయ యాంత్రీకరణ - రూ.187.68 కోట్లు
* రైతు సేవా కేంద్రాలకు - రూ.26.92 కోట్లు
* ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్స్ - రూ.44.03 కోట్లు
* వ్యవసాయ శాఖ - రూ.8,564.37 కోట్లు
* ఉద్యాన శాఖ - రూ. 3469.47 కోట్లు
* పట్టు పరిశ్రమ - రూ.108.4429 కోట్లు
* ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం - రూ.507.038 కోట్లు
* ఉద్యాన విశ్వవిద్యాలయం - రూ.102.227 కోట్లు
* శ్రీ వెంకటేశ్వర పశు విశ్వవిద్యాలయం - రూ.171.72 కోట్లు
* మత్స్య విశ్వవిద్యాలయం - రూ.38 కోట్లు
* పశుసంవర్ధక శాఖ - రూ.1,095.71 కోట్లు
* మత్స్య రంగం అభివృద్ధి - రూ.521.34 కోట్లు
* ఉపాధి హామీ అనుసంధానం - రూ.5,150కోట్లు
* ఎన్టీఆర్ జలసిరి - రూ.50 కోట్లు
* నీటిపారుదల ప్రాజెక్టుల నిర్వహణ - రూ.14,637.03 కోట్లు
* రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పతనం అంచున ఉంది
* రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాల్సి ఉంది
* గత ప్రభుత్వ పాలనను ప్రజలు పాతరేశారు
* రెవెన్యూ వ్యయం అంచనా రూ.2.34 లక్షల కోట్లు
* మూలధన వ్యయం అంచనా రూ.32,712 కోట్లు
* రెవెన్యూ లోటు రూ.34,743 కోట్లు
* ద్రవ్య లోటు రూ.68,743 కోట్లు
* జీఎస్‌డీపీలో రెవెన్యూ లోటు అంచనా 4.19 శాతం
* జీఎస్‌డీపీలో ద్రవ్య లోటు అంచనా 2.12 శాతం
* ఎస్సీ సంక్షేమం – రూ.18,497 కోట్లు
* ఎస్టీ సంక్షేమం - రూ.7,557 కోట్లు
* బీసీ సంక్షేమం - రూ.39,007 కోట్లు
* మైనార్టీ సంక్షేమం - రూ.4,376 కోట్లు
* మహిళ, శిశుసంక్షేమం - రూ.4,285 కోట్లు
* ఉన్నత విద్య - రూ.2,326 కోట్లు
* ఆరోగ్యరంగం - రూ.18,421 కోట్లు
* పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి - రూ.16,739 కోట్లు
* పట్టణాభివృద్ధి - రూ.11,490 కోట్లు
* గృహ నిర్మాణం - రూ.4,012 కోట్లు
* నైపుణ్యాభివృద్ధి శాఖ – రూ.1,215 కోట్లు
* పాఠశాల విద్యాశాఖ – రూ.29,909 కోట్లు
* జలవనరులు - రూ.16,705 కోట్లు
* పరిశ్రమలు, వాణిజ్యం - రూ.3,127 కోట్లు
* ఇంధనరంగం - రూ.8,207 కోట్లు
* రోడ్లు, భవనాలు - రూ.9,554 కోట్లు
* యువజన, పర్యాటక, సాంస్కృతిక శాఖ – రూ.322 కోట్లు
* పోలీసు శాఖ – రూ.8,495 కోట్లు
* పర్యావరణం, అటవీశాఖ – రూ.687 కోట్లు
* 192 నైపుణ్య కేంద్రాలు, కళాశాలల ఏర్పాటు..
* విదేశీ ఉపాధి అవకాశాలు పెంచడమే స్కిల్ ఇంటర్నేషనల్ లక్ష్యం
అంతకముందు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మరోవైపు ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్‌ను ఆ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సభ ముందు ఉంచారు. శాసనమండలిలో బడ్జెట్‌ను మంత్రి కొల్లు రవీంద్ర, వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి నారాయణ ప్రవేశపెట్టారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఓట్ ఆన్ ఎకౌంట్ బడ్జెట్‌ను రెండుసార్లు ఆమోదింపజేసుకొని నిధులు ఖర్చు చేస్తున్నారు. సుమారు రూ.2.94 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టారు. అంతకముందు 2024-25 వార్షిక బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదం తెలిపింది. బడ్జెట్ హైలైట్స్ ఇలా ఉన్నాయి.