పగిడ్యాల మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల ఆవరణంలో విద్యార్థులకు ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను వెంటనే తొలగించాలని, సిపిఎం మండల కన్వీనర్ పకీర్ సాహెబ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ప్రాథమిక పాఠశాల ఆవరణంలో ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ను విద్యార్థులతో కలిసి పరిశీలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు గంధం హుస్సేన్ విద్యార్థులు పాల్గొన్నారు.