కూటమి సర్కార్ మభ్యపెట్టే బడ్జెట్ ప్రవేశపెట్టిందని.. 8 నెలల పాటు బడ్జెట్ పెట్టకుండా ఎందుకు సాగదీశారంటూ వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు , మాజీ సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి నిలదీశారు. బడ్జెట్ పత్రాలే బాబు డ్రామా ఆర్టిస్ట్ అని తేల్చాయి. బడ్జెట్ చూస్తే బాబు ఆర్గ్‌నైజ్డ్ క్రైమ్ తెలుస్తుందన్నారు. ఇది ఏమైనా బడ్జెటా అంటూ వైయస్ జగన్ చంద్రబాబును నిలదీశారు. ఎన్నికల ముందు రాష్ట్ర అప్పులు రూ. 14 లక్షల కోట్లు అని దుష్ప్రచారం చేశారు. అధికారంలోకి వచ్చాక కూడా చంద్రబాబు తప్పుడు ప్రచారం చేశారు. చివరకు గవర్నర్‌తో కూడా అబద్ధాలు చెప్పించారు.
సూపర్ సిక్స్ హమీలను ఎగ్గొట్టేందుకు బాబు దుష్ప్రచారం చేశారు. 2018-19 నాటికి రూ.3 లక్షల 13 వేల కోట్ల అప్పు. మా ప్రభుత్వం దిగిపోయే నాటికి 6 లక్షల 46 వేల కోట్లు అప్పు. రూ.14 లక్షల కోట్లు అప్పు చేశామని దుష్ప్రచారం చేశారు. చంద్రబాబు హయాంలో 19 శాతం అప్పులు పెరిగితే.. మా హయాంలో 15 శాతం అప్పులు పెరిగాయి. ఎవరి పాలనలో రాష్ట్రం శ్రీలంక అయిపోయిందో చెప్పాలి. అప్పు రత్న బిరుదు ఎవరికివ్వాలి?. ఆర్థిక క్రమశిక్షణ పాటించింది ఎవరు?. అప్పుల పెంపు వార్షిక సగటు చంద్రబాబు హయాంలో కన్నా మా హయాంలో తక్కువ అని వైయస్ జగన్ వివరించారు.