హామీలు ఎగవేసి ప్రశ్నిస్తున్న వారిని కూటమి ప్రభుత్వం వేధిస్తోంది. ఈ ప్రభుత్వ నిరంకుశత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని వైయస్ జగన్ మోహన్ రెడ్డి హెచ్చరించారు. ట్విట్టర్‌లో పోస్టులు పెట్టినందుకు ప్రభుత్వం అరెస్ట్ చేయదలచుకుంటే ముందు తనతోనే ఆరంభించాలని వైయస్ జగన్ సవాల్ చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ప్రజలు కూడా చంద్రబాబును పశ్నించాలని వైయస్ జగన్ పిలుపునిచ్చారు. జననేత పిఉపుతో హామీలు అమలుచేయని చంద్రబాబును ప్రశ్నిస్తూ పోస్టులు పెడుతున్నారు.
రెండు రోజులుగా ఎక్స్ వేదికగా చంద్రబాబును ప్రశ్నిస్తుండటం ట్రెండింగ్ సృష్టిస్తోంది. ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రజలకు సూపర్‌సిక్స్ పేరుతో ఇచ్చిన హామీలకు బడ్జెట్‌లో నిధులు కేటాయించకుండా మోసం చేసింది పార్టీ నాయకులు మండిపడుతున్నారు. బడ్జెట్‌లో సూపర్ సిక్స్ పథకాలకు నిధులు ఎగ్గొట్టడం మోసం కాదా చంద్రబాబు అంటూ నిలదీస్తున్నారు. రాష్ట్రంలోని యువత, మహిళలు, రైతులను మోసం చంద్రబాబుపై 420 కేసు ఎందుకు పెట్టకూడదని అందరూ ట్వీట్ చేస్తున్నారు.