మణిపూర్‌లో మరోసారి హింసాత్మక సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా దుండగులు పలువురు ఎమ్మెల్యేల నివాసాలను ముట్టడించి బీభత్సం సృష్టించారు. ఈ నేపథ్యంలో మణిపూర్ పోలీసులు 23 మంది వ్యక్తులను అరెస్టు చేశారు. మరోవైపు, ఇంఫాల్ వెస్ట్, ఇంఫాల్ ఈస్ట్‌లో 48 గంటల ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడంతో పాటు అధికారులు కర్ఫ్యూ విధించారు. ఈ నిబంధనలు వెంటనే అమల్లోకి వస్తాయని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa