ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహారాష్ట్ర, జార్ఖండ్ ఎగ్జిట్ పోల్స్.. రెండు రాష్ట్రాల్లోనూ కమల వికాసమే!

national |  Suryaa Desk  | Published : Wed, Nov 20, 2024, 10:36 PM

దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతోపాటు జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ విడుదల అవుతున్నాయి. మహారాష్ట్రలో అధికారంలో ఉన్న మహాయుతి కూటమి తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ కోసం ఆ రెండు రాష్ట్రాల ప్రజలు, పార్టీలే కాకుండా దేశం మొత్తం ఎదురుచూస్తోంది. ఎన్డీఏ, ఇండియా కూటముల మధ్య హోరాహోరీ ప్రచారం జరగ్గా.. ఎన్నికల సంఘం విడుదల చేసే ఫలితాల కంటే ముందు.. ఎగ్జిట్ పోల్స్ సంస్థలు ఏం చెప్తాయి అనేది ప్రస్తుతం తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి.


మహారాష్ట్ర, జార్ఖండ్ ఎగ్జిట్ పోల్స్


మహారాష్ట్ర ఎగ్జిట్ పోల్స్


పీపుల్స్ పల్స్


మహాయుతి(బీజేపీ-షిండే శివసేన- అజిత్ ఎన్సీపీ)--175-195 సీట్లు


మహా వికాస్ ఆఘాఢీ(కాంగ్రెస్-ఉద్ధవ్ శివసేన-శరద్ పవార్ ఎన్సీపీ)--85-112 సీట్లు


ఇతరులు--7-12


కేకే సర్వే


మహాయుతి(బీజేపీ-షిండే శివసేన- అజిత్ ఎన్సీపీ)-225 సీట్లు


మహా వికాస్ ఆఘాఢీ(కాంగ్రెస్-ఉద్ధవ్ శివసేన-శరద్ పవార్ ఎన్సీపీ)- 56


ఇతరులు-07


 రిపబ్లిక్ సర్వే


మహాయుతి(బీజేపీ-షిండే శివసేన- అజిత్ ఎన్సీపీ)--150-170 సీట్లు


మహా వికాస్ ఆఘాఢీ(కాంగ్రెస్-ఉద్ధవ్ శివసేన-శరద్ పవార్ ఎన్సీపీ)--110-130 సీట్లు


ఇతరులు--8-10 సీట్లు


మ్యాట్రిజ్


మహాయుతి(బీజేపీ-షిండే శివసేన- అజిత్ ఎన్సీపీ)--150-170 సీట్లు


మహా వికాస్ ఆఘాఢీ(కాంగ్రెస్-ఉద్ధవ్ శివసేన-శరద్ పవార్ ఎన్సీపీ)-- 110-130 సీట్లు


ఇతరులు--8-10 సీట్లు


పీ మార్క్


మహాయుతి(బీజేపీ-షిండే శివసేన- అజిత్ ఎన్సీపీ)--135-157 సీట్లు


మహా వికాస్ ఆఘాఢీ(కాంగ్రెస్-ఉద్ధవ్ శివసేన-శరద్ పవార్ ఎన్సీపీ)-- 126-146 సీట్లు


ఇతరులు--2-8సీట్లు


లోక్‌శాహీ మరాఠీ


మహాయుతి(బీజేపీ-షిండే శివసేన- అజిత్ ఎన్సీపీ)--128-142 సీట్లు


మహా వికాస్ ఆఘాఢీ(కాంగ్రెస్-ఉద్ధవ్ శివసేన-శరద్ పవార్ ఎన్సీపీ)-- 125-140 సీట్లు


ఇతరులు --18-23 సీట్లు


జార్ఖండ్ ఎగ్జిట్ పోల్స్


పీపుల్స్ పల్స్


బీజేపీ కూటమి--44-53 సీట్లు


ఇండియా కూటమి--25-37 సీట్లు


ఇతరులు--5-9 సీట్లు


మ్యాట్రిజ్


బీజేపీ--42-47 సీట్లు


ఇండియా కూటమి--25-30 సీట్లు


ఇతరులు--1-4 సీట్లు


టైమ్స్‌ నౌ-జేవీసీ


బీజేపీ--40-44 సీట్లు


ఇండియా కూటమి--20-40 సీట్లు


ఇతరులు--1 సీటు


మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ వెల్లడి అవుతున్నాయి. మహారాష్ట్రలో నేడు(నవంబర్ 20) ఒకే విడతలో ఎన్నికలు జరగ్గా.. జార్ఖండ్‌లో రెండు దశల్లో పోలింగ్ పూర్తయింది. ఈ నేపథ్యంలోనే తాజాగా అందరి దృష్టి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే కొన్ని రోజుల క్రితం హర్యానా, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసిన ఫలితాలకు.. ఎన్నికల సంఘం ప్రకటించిన తుది ఫలితాలకు పొంతన లేకపోవడంతో తాజాగా మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఏ విధమైన ఎగ్జిట్ పోల్స్ వెలువడుతాయి అనేది అందరిలోనూ ఉత్కంఠ రేపుతోంది. మహారాష్ట్రలో 288 సీట్లు ఉండగా.. మేజిక్ ఫిగర్ 145. ఇక జార్ఖండ్‌లో 81 సీట్లు ఉండగా.. మేజిక్ ఫిగర్ 41.


288 అసెంబ్లీ స్థానాలు ఉన్న మహారాష్ట్రలో ఇవాళ (నవంబర్ 20వ తేదీన) ఒకే విడతలో పోలింగ్ నిర్వహించారు. ఇక్కడ అధికార మహాయుతి కూటమి(బీజేపీ-షిండే శివసేన-అజిత్ పవార్ ఎన్సీపీ).. ప్రతిపక్షంలో ఉన్న మహావికాస్ ఆఘాఢీ(కాంగ్రెస్-ఉద్ధవ్ శివసేన-శరద్ పవార్ ఎన్సీపీ) హోరాహోరీగా పోటీపడుతున్నాయి. దేశంలోనే ఉత్తర్‌ప్రదేశ్ తర్వాత పెద్ద రాష్ట్రమైన మహారాష్ట్రలో పట్టు నిలుపుకోవడం కోసం ఎన్డీఏ, ఇండియా కూటములు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులు సహా బీజేపీ సీనియర్ నేతలు జోరుగా ప్రచారం చేయగా.. అందుకు ధీటుగా కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతోపాటు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే మరాఠావాసులు ఏం తీర్పు ఇవ్వనున్నారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.


మరోవైపు.. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపైనా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుత ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నేతృత్వంలోని జార్ఖండ్ ముక్తి మోర్చా కూటమి తిరిగి అధికారంలోకి వస్తుందా లేక బీజేపీ గెలుస్తుందా అనేది వేచి చూడాల్సిందే. భూ కుంభకోణం కేసులో సీఎం హేమంత్ సోరెన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్-ఈడీ అధికారులు అరెస్ట్ చేయగా.. కొన్ని నెలల పాటు జైలులో ఉండి బయటికి వచ్చారు. జైలుకు వెళ్లేముందు సీఎం పదవికి రాజీనామా చేసిన హేమంత్ సోరెన్ తిరిగి వచ్చిన తర్వాత మళ్లీ పగ్గాలు చేపట్టారు. మరోవైపు.. 81 స్థానాలు ఉన్న జార్ఖండ్ అసెంబ్లీకి రెండు దశల్లో పోలింగ్ నిర్వహించారు. తొలి దశ పోలింగ్ ఈ నెల 13వ తేదీన జరగ్గా.. తాజాగా నేడు రెండో దశ పోలింగ్ జరిగింది. మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ నవంబర్ 23వ తేదీన జరగనుండగా.. అదే రోజు ఫలితాలు వెల్లడి కానున్నాయి.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com