మదనపల్లె నియోజకవర్గంలో లక్ష టీడీపీ సభ్యత్వాలే లక్ష్యంగా పనిచే స్తున్నామని టీడీపీ మైనారిటీ నాయ కులు ఎస్ఏ మస్తాన, జానబాబు పేర్కొ న్నారు. గురువారం పట్టణంలోని బెంగ ళూరు బస్టాండు, రామారావు కాలని వద్ద టీడీపీ సభ్యత్వ నమోదు శిబిరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రారంభించిన తక్కువ రోజుల్లోనే నేటి వరకు 24వేలకు పైగా టీడీపీ సభ్యత్వాలు తీసుకున్నారన్నారు. అసెంబ్లీ సమావేశాల అనంతరం ఎమ్మెల్యే మదనప ల్లెకు చేరుకోగానే సభ్యత్వ నమోదు కార్యక్రమం మరింత వేగంగా చేస్తామన్నారు. రామారావు కాలనిలో ఒక్క రోజే 214 మంది సభ్యత్వ నమోదు చేయించుకున్నారు. ఈ కార్యక్రమాల్లో టీడీపీ నాయకులు ఎర్రబల్లి వెంకటరమణారెడ్డి, నాగమణి, వినోద్, తదితరులు పాల్గొన్నారు.