మంత్రి సవిత వ్యాఖ్యలు చాలా హేయమైనవని వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మండిపడ్డారు. ఆమె ఒక మహిళా మంత్రిగా ఉండి ఇలా మాట్లాడటం సిగ్గుచేటు అన్నారు. ఈ కూటమి ప్రభుత్వంలో మహిళలకు కనీస విలువ లేదు. వైయస్ జగన్ మహిళలకు పెద్దపీట వేశారని గుర్తు చేశారు. మహిళలను కించపరిచే సంస్కృతి చంద్రబాబుది. 2014-19లో సాక్షాత్తూ చంద్రబాబు సీఎంగా మహిళలను కించపరిచేలా మాట్లాడారు. నోటితో చెప్పలేని విధంగా బాలకృష్ణ మహిళలను అవమానపరిచారు. తక్షణమే మహిళలందరికీ మంత్రి సవిత క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండు చేశారు.
వైయస్ జగన్ బటన్ నొక్కడం వల్ల మహిళలు గంజాయికి, మద్యానికి అలవాటు పడ్డారని మంత్రి సవిత అనడం దుర్మార్గం అని వైయస్ఆర్‌సీపీ మండిపడ్డారు. ఏపీ శాసనమండలిలో మంత్రి సవిత చేసిన వ్యాఖ్యలపై వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో డీబీటీ డబ్బుల ద్వారా మహిళలు గంజాయి, మద్యానికి బానిసలు అయ్యారని మంత్రి వ్యాఖ్యలు చేయడంపై ఎమ్మెల్సీలు మండిపడ్డారు. మంత్రి సవిత.. తక్షణమే రాష్ట్ర మహిళలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.