రెక్కల కష్టం పై ఆధారపడిన ముఠా కార్మికులకు సమగ్ర చట్టం చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్. రాము అభ్యర్థించారు. శనివారం అచ్యుతాపురం ఎస్ ఈ జెడ్ లో ముఠా కార్మికులతో నిర్వహించిన సమావేశంలో ముఠా కార్మిక చట్టం అమలు చేయాలని.
ఈనెల 26వ తేదీన దేశవ్యాప్తంగా చేపట్టనున్న ఆందోళన కార్యక్రమం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ముఠా నాయకులు సత్తిబాబు, తాతారావు, అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.