మచిలీపట్నం చిలకలపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో వలందపాలెంకు చెందిన ముగ్గురు మైనర్ బాలికలు అదృశ్యమయ్యారు. కాగా ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
తల్లిదండ్రులు తెలిసిన వారందరి వద్ద విచారణ చేసిన అనంతరం ఎంతకీ ఆచూకీ లభ్యం కాకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. ముగ్గురు బాలికల అదృశ్యంపై శనివారం చిలకలపూడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.