సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులపై అరెస్టులు కొనసాగుతున్నాయి. కూటమి పెద్దలు, సీఎం, డిప్యూటీ సీఎం, లోకేష్‌పై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ వ్యహారాన్ని కూటమి సర్కార్ సీరియస్‌గా తీసుకుంది. అసభ్యంగా పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. పోస్టులు పెడుతున్న సైకోలను ఎక్కడిక్కడ అరెస్ట్‌లు చేస్తున్నారు. ఇప్పటికే అనేక మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అసభ్యకరపోస్టుల పెడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు కూడా హెచ్చరికలు జారీ చేశారు.తాజాగా తుని పరిధిలో సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.
దాదాపు 17 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలువురిని రిమాండ్ కోసం కోర్టుకి తరలించారు. అరెస్ట్‌లపై తుని రూరల్ సర్కిల్ సీఐ మాట్లాడుతూ .. సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టేవారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఇతర గ్రూపుల్లో వచ్చిన అసభ్య పోస్టులను కూడా షేర్ చేయకూడదని తెలిపారు.షేర్ చేసినా కామెంట్స్ పెట్టినా శాంతి భధ్రతలకుభంగం కలిగించినా నేరమే అని స్పష్టం చేశారు. ముఖ్యంగా యువత ఇలాంటి కేసుల్లో ఇరుక్కుని వారి భవిష్యత్తుని నాశనం చేసుకోవద్దని సూచించారు. ‘‘మిమ్మల్ని ఎవరైనా ప్రలోభ పెట్టినా ఇలాంటి పోస్టులు పెట్టొద్దు’’ అని సీఐ స్పష్టం చేశారు.