ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హోటల్స్, లాడ్జీలు నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Nov 24, 2024, 03:38 PM

విశాఖ నగరంలో పోలీసులు హోటల్స్, లాడ్జీలు, మెన్ హాస్టళ్లపై పోలీసులు తనిఖీలు చేపట్టారు. ప్రభుత్వ నిబంధనలు పాటించని హోటళ్లు, లాడ్జీలను గుర్తించారు. విశాఖ నగరంలోని జోన్ 1, జోన్ 2 పరిధిలో 80 బృందాలతో 270 మంది పోలీసులతో 80 హాస్టళ్లు, లాడ్జిలు, 5 మెన్ హాస్టళ్లలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. 47 హోటల్స్, లాడ్జీలలో అగ్నిమాపక ఎన్‌వోసీలు లేవు.. 22 హోటల్స్, లాడ్జీలలో జీఎస్టీ పత్రాలు లేవని, 8 హోటల్స్, లాడ్జీలలో ట్రేడ్ లైసెన్సులు లేనట్లు పోలీసులు గుర్తించారు.


అలాగే 11 హోటల్స్, లాడ్జిలలో ఎఫ్ఎస్ఎస్ఏఐ సర్టిఫికెట్స్ లేవని... 5 హోటల్స్‌లో సందర్శికులకు సంబంధించి రికార్డులు మెంటైన్ చేయడం లేదని పోలీసులు పేర్కొన్నారు. మరో 36 హోటల్స్, లాడ్జీలలో లగేజ్ స్కానర్, అండర్ వెహికల్ చెక్ మిర్రర్ వంటి యాక్సెస్ లేదని, 5 హోటళ్లలో సీసీటీవీలను పర్యవేక్షించడం లేదన్నారు. హోటల్స్, లాడ్జీలలో నిబంధనలు పాటించకపోతే కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని విశాఖ నగర సీపీ హెచ్చరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com