పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికి తగిన గుర్తింపు ఉంటుందని మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ అన్నారు. ఆదివారం పిఠాపురం టీడీపీ కార్యాలయంలో నాయకులతో సమావేశం నిర్వహించారు. రానున్న నీటి సంఘాల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాలన్నారు. అలాగే టీడీపీ సభ్యత్వాలు వేగవంతం చేయాలన్నారు. ప్రస్తుతం 15వేలు పూర్తయ్యింనది, మరింత పెంచాలన్నారు. వెలమ కార్పొరేషన్ డైరెక్టర్ నియమితులైన బర్ల అప్పారావను సత్కరించారు. ఆయన పార్టీకి అందిం చిన సేవలను కొనియాడారు. సకుమళ్ల గంగాధర్, బర్ల అప్పారావు తదితరులు పాల్గొన్నారు.