68వ రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బీచ్ వాలీబాల్ పోటీలను మంగళవారం ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ, జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి బాపట్ల మండలం సూర్యలంక బీచ్ లో ప్రారంభించారు.
అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రస్థాయి బీచ్ వాలీబాల్ పోటీలు బాపట్లలో జరగటం హర్షణీయమని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో గ్రామస్థాయి నుండి క్రీడలకు ప్రాధాన్యత ఇస్తుందని ఎమ్మెల్యే వేగేశన అన్నారు.