రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆర్బీఐ అధికార ప్రతినిధి ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారు. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మంగళవారం ఉదయం స్వల్ప అస్వస్థతకు గురికావడంతో చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. చికిత్స అనంతరం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు ప్రకటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa