గతంలో ఎక్కువ గంటలు పనిచేయాల్సి వచ్చేదని వెల్లడి.టెక్నాలజీ వల్ల ఎక్కువ గంటలు పనిచేయాల్సిన అవసరం లేదని స్పష్టీకరణ.ప్రభుత్వ ఉద్యోగులు స్మార్ట్ వర్క్ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. సాయంత్రం 6 గంటల తర్వాత ఉద్యోగులు కార్యాలయాల్లో ఉండొద్దని స్పష్టం చేశారు. గతంలో ఎక్కువ గంటలు పనిచేసే సంస్కృతి ఉండేదని వెల్లడించారు. అయితే, ప్రస్తుతం టెక్నాలజీ వల్ల ఎక్కువ గంటలు పనిచేసే అవసరంలేదని తెలిపారు. ఉద్యోగులు ఎవరూ ఎక్కువ గంటలు కష్టపడాల్సిన అవసరంలేదని చంద్రబాబు పేర్కొన్నారు. స్మార్ట్ వర్క్ ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చని అభిప్రాయపడ్డారు.