విజయనగరం పట్టణంలో రెండు షాపుల్లో చోరీలకు పాల్పడిన నేరస్థుడిని వన్ టౌన్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేసినట్లు ఇన్ ఛార్జ్ సీఐ ఎల్. అప్పల నాయుడు తెలిపారు.
జూలై 15 రాత్రి ఓ స్వీట్ షాపులో రూ50వేలు, నవంబరు 25 రాత్రి బార్ అండ్ రెస్టారెంట్లో రూ12వేలు, చోరీ జరిగినట్లు వచ్చిన ఫిర్యాదులతో దర్యాప్తు చేశామన్నారు. రెండు నేరాలకు సంబంధించి తూర్పు గోదావరి జిల్లా వాసి దేవన బుజ్జయ్యను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించామన్నారు.