రాష్ట్ర వ్యాప్తంగా గోతులు పడిన రహదారులకు మరమ్మతులు చేపట్టి గుంతల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి అన్నారు. గురువారం ఒంటిమిట్ట మండలం మల్లకాటి పల్లెలో పాట్‌హోల్ ఫ్రీ కార్యక్రమంలో బాగంగా అధికారులతో కలిసి మంత్రి రోడ్ల మరమ్మత్తు పనులను పర్యవేక్షించారు. రూ. 4. 9 లక్షలతో చేపట్టిన ప్యాచ్ వర్క్ పనులను మంత్రి పరిశీలించారు.