తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా మేడారం అడవుల్లో బుధవారం వచ్చిన భూకంపం రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనంగా మారింది. మేడారం అడవుల్లో భూమికి 40కి.మీ. లోతున భూకంప కేంద్రం ఉందని అధికారులు గుర్తించారు. రిక్టార్ స్కేలుపై 5.3 తీవ్రతతో భూకంపం నమోదైనట్లు వెల్లడించారు. దీని ప్రభావం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు జిల్లాలపై పడింది. ఇరు రాష్ట్రాల్లోనూ పలు చోట్ల భూమి కంపించడంతో ప్రజలు అయోమయానికి గురయ్యారు. ఏం జరుగుతుందో అర్థంకాక తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఇళ్లు, అపార్ట్మెంట్లు ఊగిపోవడంతో అంతా తీవ్ర భయాందోళనలకు లోనయ్యారు.