ఏపీని వర్షాలు వీడటం లేదు. రేపు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 6, 7 తేదీల్లో ఏర్పడే ఆవర్తనం దక్షిణ దిశగా పయనించే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.
ఆవర్తనంపై శుక్రవారం ఒక స్పష్టత వస్తుందని తెలిపారు. ఇప్పటికే కోస్తా జిల్లాల్లో సాధారణం కంటే అధికంగా వర్షపాతం నమోదైంది. ఈ క్రమంలో ఏపీకి మరోసారి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa