ఉత్తరాంధ్ర జిల్లాల సమీక్ష సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పీడీఎస్ రైస్ అక్రమార్కులపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలని ఆదేశించారు.
'అక్రమ రవాణాకు పాల్పడుతున్న వాళ్లపై నేర తీవ్రత ఆధారంగా రౌడీ షీట్లు తెరిచేందుకు వెనుకాడవొద్దు, 6(ఏ) కేసులు, సీజ్ చేసే విషయంలో అలసత్వం ప్రదర్శించ వద్దు. BNS పరిధిలో వున్న అన్ని అవకాశాలను ఉపయోగించుకుని నిందితులపై చర్యలు తీసుకోవాలి' అని అన్నారు.