భారత్- చైనా మధ్య దౌత్య సంబంధిత చర్చలు జరిగాయి. ఢిల్లీ వేదికగా జరిగిన ఈ భేటీలో ఇరు దేశాలకు చెందిన అధికారులు సరిహద్దుల్లో పరిస్థితులను సమీక్షించారు. వాస్తవాధీన రేఖ వెంబడి గస్తీ, బలగాల ఉపసంహరణకు సంబంధించి ఇటీవల కుదుర్చుకున్న ఒప్పందం అమలుపై సానుకూలంగా చర్చలు జరిగాయని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. ఈ దౌత్య చర్చల సందర్భంగా ప్రత్యేక ప్రతినిధుల తదుపరి భేటీకి భారత్, చైనా సంసిద్ధత వ్యక్తం చేశాయని తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa