తెలుగుదేశం అధికారిక ఎక్స్ హ్యాండిల్ నుంచి వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్ జగన్‌పై మార్ఫింగ్ ట్వీట్‌తోపాటు, సీమరాజా అనే పేరుతో యూట్యూబ్‌లో తనను, తమ పార్టీ నాయకులను అసభ్యంగా పదజాలంతో దూషిస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గుంటూరు జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్‌లో రెండు ఫిర్యాదులు చేశారు. ఆయన వెంట పార్టీ సీనియర్ నాయకులు మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, గుంటూరు వెస్ట్ నియోజకవర్గ ఇన్‌చార్జి నూరి ఫాతిమా, లీగల్ సెల్ ప్రతినిధులు తదితరులు ఉన్నారు.