ఏ ఒక్క రైతు నుంచీ తాను భూమి లాక్కోలేదని, మార్కెట్ రేటు కంటే ఎక్కువకే సెజ్‌లో భూములు కొన్నట్లు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా స్పష్టం చేశారు. తనపై అధికార కూటమి బురద చల్లుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకినాడ సెజ్‌లో తాను మార్కెట్ రేటు కంటే ఎక్కువ ధరకే భూములు కొనుక్కున్నాను తప్ప.. ఏ రైతు నుంచీ లాక్కోలేదని మాజీ మంత్రి దాడిశెట్టి రాజా వెల్లడించారు. వైయస్ఆర్‌సీపీలో ఉంటే భూములు కొనకూడదా? అని ప్రశ్నించిన ఆయన, దీనిపై బురద చల్లడం కోసమే ఎల్లో మీడియా కథనాలు రాస్తోందని ఆక్షేపించారు. సీఎం చంద్రబాబు అమరావతిలో, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ పిఠాపురంలో భూములు కొన్నారని గుర్తు చేసిన ఆయన, మరి వారు ఏ రైతుల నుంచి ఆ భూములు లాక్కున్నారని నిలదీశారు.