ప్రజా సమస్యలపై ఉద్యమ బాటలో భాగంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ 11న రాష్ట్రవ్యాప్తంగా తలపెట్టిన రైతుల సమస్యలపై ఆందోళన కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కోడ్ కారణంగా డిసెంబర్ 13కి వాయిదా వేసినట్లు వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయం పార్టీ శ్రేణులకు సమాచారం పంపింది. డిసెంబర్ 11న 5 జిల్లాల్లో ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కోడ్ అమలులో ఉంది. అందుకుగాను రాష్ట్రమంతటా ఈ ఆందోళన కార్యక్రమం 13కు వాయిదా వేశారు. కూటమి ప్రభుత్వ మోసాలను నిలదీసి, ప్రజా సమస్యలపై ఉద్యమబాటకు వైయస్ జగన్ ఇప్పటికే పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా రైతు సమస్యలపై ఈ నెల 13న, కరెంటు ఛార్జీల మోతపై 27న, విద్యార్ధులకు బాసటగా ఫీజు రీఇంబర్స్‌మెంట్‌పై జనవరి 3 న రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. పెంచిన కరెంటు ఛార్జీలపై ఆందోళన. ఎస్‌ఈ కార్యాలయాలు, సీఎండీ కార్యాలయాలకు ప్రజలతో కలిసి వెళ్లి విజ్ఞాపన పత్రాలు అందించే కార్యక్రమం. జనవరి 3వ తేదీన ఫీజు రీయంబర్స్‌మెంట్ అంశంపై పోరుబాట. పెండింగ్ బకాయిలు విడుదల చేయాలంటూ.. విద్యార్థులతో కలిసి జనవరి 3న కలెక్టర్ కార్యాలయాలకు వెళ్లి వినతిపత్రం అందించే కార్యక్రమం చేయనున్నారు.