జగన్ ప్రభుత్వం రూ.42 వేల కోట్లతో రహదారుల నిర్మాణం చేసిందని సాక్షి దినపత్రిక రాసిందని.. రాష్ట్రంలో రోడ్లు ఎక్కడ నిర్మించారో చూపించాలని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సవాల్ విసిరారు. రోడ్ల అభివృద్ధిపై చర్చకు జగన్ రావాలని ఛాలెంజ్ చేశారు. నంద్యాల చెక్ పోస్ట్ నుంచి గార్గేయపురం వరకూ రోడ్డు పనులు పరిశీలించినట్లు తెలిపారు.. కేజీ రహదారి విస్తరణ.. నగరంలోని రోడ్లు వెడల్పుకు డీపీఆర్ తయారు చేయమని అధికారులను ఆదేశించామని అన్నారు. కర్నూలులోమంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ... రోడ్లపై ట్రాన్స్ ఫార్మర్స్ ఉండటం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని.. వాటిని తొలగించాలని ఆదేశాలు ఇచ్చామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు.ఆదోనిలో 40 శాతం మాత్రమే రోడ్ల పనులు జరిగాయని... మిగతా పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. సంక్రాంతి లోపు ఏపీ వ్యాప్తంగా గుంతలను పూడ్చి వేస్తామని అన్నారు. గత ప్రభుత్వం రోడ్ల పనులకు రెన్యూవల్ చేయలేదని... దీంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారని.. ఫలితంగా పర్యాటక శాఖకు భారీ నష్టం వాటిల్లిందని చెప్పారు. అమరావతిలో భారీ బడ్జెట్ తో రహదారుల నిర్మాణం చేపడుతున్నామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు.ఇతర రాష్ట్రాల్లో రోడ్లపై అధ్యయనం చేశామని.. త్వరలోనే పీపీ మోడల్ లో రోడ్ల నిర్మాణం చేస్తున్నామని చెప్పారు. గతంలో పక్క రాష్ట్రం తెలంగాణ వాళ్లు.. ఏపీపై జోకులు వేసుకున్నారని చెప్పారు. ఓర్వకల్లు అభివృద్ధికి రూ. 3 వేల కోట్లు కేంద్రం నిధులు రావడం గర్వించదగ్గ విషయమని చెప్పారు. ఓర్వకల్లులో డ్రోన్ హబ్ అడిగామని సీఎం చంద్రబాబు ఇచ్చారని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు.