ఏళ్లుగా ఎదురుచూస్తున్న భూ సమస్యలకు రెవెన్యూ సదస్సులతో పరిష్కారమవుతాయని ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు తెలిపారు. అగ్రహారం భూ సమస్యలు వెంటనే పరిష్కరించాలనియ సంబంధిత అధికారులను ఆదేశించారు. జగన్ పాలనలో తుపాకీలు గురిపెట్టి ఆస్తులు కొట్టేశారని ఆరోపించారు. ఐదేళ్లు ప్రైవేట్ ఆస్తులు కొల్లగొట్టారని, ప్రభుత్వ ఖజానా లూటీ చేశారని మండిపడ్డారు. లంచాల పేరుతో రైతులను ఇబ్బందిపెడితే కఠినచర్యలు తీసుకుంటామని జీవీ ఆంజనేయులు హెచ్చరించారు.వైసీపీ హయాంలో రీసర్వే పేరిట భూములు కొట్టేశారని ఆరోపించారు. రీసర్వే పేరుతో ఊరికో భూబకాసురుడిని తయారుచేశారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్తులు జగన్ కొల్లగొడితే గ్రామాల్లో స్థానిక వైసీపీ నేతలు మేసేశారని విమర్శించారు. కబ్జాకు ప్రయత్నించినా, బెదిరించినా సమగ్ర భూకబ్జాల నియంత్రణ చట్టంతో శిక్షలు ఉంటాయని అన్నారు.భూకబ్జాలపై పదేళ్ల నుంచి 14ఏళ్ల వరకు జైలుశిక్ష పడేలా చట్టాన్ని తెచ్చామని ఆంజనేయులు హెచ్చరించారు.