ప్రభుత్వ భూమిని కబ్జా చేసినా, ప్రవేట్ వ్యక్తి ఆస్థి లాక్కున్నా నాన్ బెయిల్ క్రింద 10 నుంచి 14 ఏళ్ల వరకు జైలు శిక్ష పడుతుందని మంత్రి నారాయణ హెచ్చరించారు. వైసీపీ ప్రభుత్వంలో ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తూ భూ కబ్జాలకు పాల్పడ్డారని ఆరోపించారు. నెల్లూరు నగరంలోని ఏసీ నగర్లో ఇవాళ(శుక్రవారం) రెవెన్యూ సదస్సు జరిగింది.ఈ సదస్సులో మంత్రి నారాయణ పాల్గొన్నారు. ఈ సపందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ... 33 రోజుల పాటు రాష్ట్రంలో రెవెన్యూ సదస్సులు జరుగుతాయని తెలిపారు. సెంటు భూమి నుంచి కొన్ని ఎకరాలనూ కూడా వైసీపీ నేతలు కబ్జా చేశారని అన్నారు. పరిశ్రమలు, పోర్టులను సైతం కబ్జా చేశారని చెప్పారు. వైసీపీ అరాచక ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు, నేతలు దోపిడీ చేశారని ఆరోపించారు. ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలో భాగంగా ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ను తీసుకువచ్చామని మంత్రి నారాయణ తెలిపారు.