వైసీపీ పరిపాలనలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని రెవెన్యూ మంత్రి అనగాని సత్య ప్రసాద్ తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు గడుస్తుందని.. రాష్ట్ర అభివృద్ధితో పాటు ప్రజల సమస్యలు పరిష్కారం ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. ప్రభుత్వం పేద ప్రజల కోసం ఒక మంచి కార్యక్రమం రూపొందించిందన్నారు. ఏపీలో ప్రజలకు ప్రధాన సమస్య ఏదైనా ఉందంటే అది భూ సమస్య అని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం కొన్ని కార్యక్రమాలు వాళ్ల స్వలాభం కోసమే చేసుకున్నారని విమర్శించారు. భూ హక్కుదారులకు పూర్తి హక్కులు కల్పించటమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అనగాని సత్య ప్రసాద్ అన్నారు.