వైసీపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి మరోసారి చురకలంటించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని 70 ఏళ్ల ముసలోడని విజయసాయిరెడ్డి అంటున్నారని.. మరి 67 ఏళ్ల వయస్సు వచ్చిన నీవు ఏమైనా కుర్రొడివా అంటూ వైసీపీ రాజ్యసభ ఎంపీకి చురకలంటించారు. ఓ సీఎంని పట్టుకుని మెంటలోడు అంటావు.. విదేశాల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ.. తాడేపల్లి ప్యాలెస్‌లో కూర్చొనే వాడు కుర్రోడా? అంటూ పరోక్షంగా వైఎస్ జగన్‌ను విమర్శించారు. నువ్వు చిప్ చిప్ బ్యాచీ కాదా? వైఎస్ జగన్ బెడ్ రూమ్‌లో నుంచి బయటకు రాగానే... చెమ్మ చెక్క కొట్టేది నువ్వు అంటు విజయసాయిరెడ్డిని వ్యంగ్యంగా అన్నారు.క్యాస్ట్ బడీస్ అన్నాడు విజయసాయి రెడ్డి.. ఒరేయ్ పొట్టి సాయిరెడ్డి, సారా రెడ్డి.. నువ్వేమైన రెడ్లకు న్యాయం చేశావా? ఈ ఐదేళ్లులో రెడ్లని సంక నాకిచ్చారంటూ విజయసాయిరెడ్డిపై ఆయన మండిపడ్డారు. శుక్రవారం నెల్లూరులో ఆనం వెంకట రమణా రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ.. వాల్యూయేషన్ అన్నావ్. ప్రపంచంలో ఏ వ్యాల్యూషన్ అయినా తీసుకో... 2,200 ఎకరాలు రూ.12 కోట్లకి ఏ పిచ్చోడు ఇస్తాడంటూ విజయసాయిరెడ్డిని ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నించారు.