తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. పలు విద్యాలయాలను కేంద్ర ప్రభుత్వం ఇరు రాష్ట్రాలకు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 8 కేంద్రీయ విద్యాలయాలు, తెలంగాణలో కొత్తగా 7 నవోదయ విద్యాలయాలు ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. కేంద్ర కేబినెట్ లో తీసుకున్న పలు కీలక నిర్ణయాలను మీడియాకు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.దేశ వ్యాప్తంగా 85 కొత్త కేంద్రీయ విద్యాలయాలు, 28 కొత్త నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయాలని కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని అన్నారు. దేశ వ్యాప్తంగా 85 కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు రూ.5872 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పారు. ఒక్కో కేంద్రీయ విద్యాలయంలో 960 మంది విద్యార్థులకు అవకాశం కల్పించినట్లు వివరించారు. దేశ వ్యాప్తంగా 28 నవోదయ విద్యాలయాల కోసం రూ.2359.82 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఒక్కో నవోదయ విద్యాలయంలో 560 మంది విద్యార్థులకు అవకాశం కల్పించినట్లు వెల్లడించారు.