విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) సినీ, రాజకీయ రంగంలో మకుటం లేని మహారాజు అని ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ చైర్మన్ టీడీ జనార్దన్ శుక్రవారం అమరావతిలో అభివర్ణించారు. ఆయన సినీ జీవితంలోకి వచ్చి 75 ఏళ్లు అయిన సందర్భంగా వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 14వ తేదీన విజయవాడలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు హాజరవుతారని చెప్పారు.